'ఇట్స్‌ ఓకే గురు' అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా: మెహర్ రమేశ్ | Its Okay Guru Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

'ఇట్స్‌ ఓకే గురు' అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా: మెహర్ రమేశ్

Dec 6 2025 9:06 PM | Updated on Dec 6 2025 9:06 PM

Its Okay Guru Movie Pre Release Event Highlights

సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లు చేసిన సినిమా 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించగా.. క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు మెహర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు పూరి జగన్నాథ్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. దాని తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement