గతంలో వ్యభిచారం కేసులో బుక్ అయిన నటి..
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్‌ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.
ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్‌సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది.
ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది.
‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్‌లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్‌తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది.
గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది.
‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె.


