breaking news
Maharani Season4
-
‘అండర్ గ్రౌండ్‌కి వెళ్లడానికి రెడీ’ అన్న హీరోయిన్
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్‌ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్‌సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది. ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది. ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్‌తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది. గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె. -
మహారాణి మళ్లీ వస్తోంది.. ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్‌గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్‌ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. -
మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్‌కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్ హిట్‌గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్‌లో ప్రసారం కానుందంటూ ట్రైలర్‌ను షేర్ చేశారు మేకర్స్.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. The lioness returns to defend her home! Rani gears up for her biggest battle yet.#Maharani4 streaming from 7th Nov only on Sony LIV#MaharaniOnSonyLIV pic.twitter.com/Xzkt7owqrp— Sony LIV International (@SonyLIVIntl) October 9, 2025 -
Maharani Season4 : రాణి భారతి మళ్లీ వచ్చేస్తోంది
ఓటీటీలో విశేష ప్రేక్షకాదారణ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ ‘మహారాణి’(Maharani Season4). బాలీవుడ్ కథానాయిక హ్యుమా ఖురేషీ(Huma Qureshi) టైటిల్ పాత్రలో నటించిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడిందులో ‘మహారాణి 4’ రాబోతుంది. పునీత్ ప్రకాశ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘మహారాణి’ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని తెలియజేసే సిరీస్ ఇది. ఈ వ్యవస్థలో ఆమెకు ఎదురైన సవాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్రలు, రాజకీయ వైరుద్ధ్యాలు ఇందులో మనం చూడొచ్చు. ప్రేక్షకాదరణ పొందిన గత మూడు సీజన్స్ తరహాలోనే నాలుగో సీజన్ కూడా మరింత గ్రిప్పింగ్ ప్రేక్షకులను మెప్పించనుంది.టీజర్‌ను గమనిస్తే ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు. టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ రానున్న సీజన్ 4పై అంచనాలను మరింతగా పెంచుతోంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


