మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Maharani Season 4 Streaming on Sony LIV from Nov 7 – Huma Qureshi Returns as Powerful CM | Sakshi
Sakshi News home page

Maharani: మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Oct 9 2025 7:01 PM | Updated on Oct 9 2025 7:21 PM

Maharani Season 4 OTT Release Date on this ott platform

ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్‌ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్‌కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్‌ హిట్‌గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో  సీజన్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.

బాలీవుడ్‌ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన‌ పాత్రలో నటించిన ఈ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగిన రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) జీవిత ప్ర‌యాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు పునీత్‌ ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజ‌న్ 4 స్ట్రీమింగ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్‌లో ప్రసారం కానుందంటూ ట్రైలర్‌ను షేర్ చేశారు మేకర్స్.

తాజాగా ట్రైలర్ రిలీజ్‌ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్‌లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement