బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది.


