Maharani Season4 : రాణి భార‌తి మళ్లీ వచ్చేస్తోంది | Maharani Season4 Teaser Out | Sakshi
Sakshi News home page

Maharani Season4 Teaser: గృహిణి నుంచి సీఎంగా ఎదిగిన మహిళ.. ఆసక్తికరంగా టీజర్‌!

Mar 4 2025 10:55 AM | Updated on Mar 4 2025 10:58 AM

Maharani Season4 Teaser Out

ఓటీటీలో విశేష ప్రేక్షకాదారణ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్‌ ‘మహారాణి’(Maharani Season4). బాలీవుడ్‌ కథానాయిక హ్యుమా ఖురేషీ(Huma Qureshi) టైటిల్‌ పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ఇప్పటికే మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడిందులో ‘మహారాణి 4’ రాబోతుంది. పునీత్‌ ప్రకాశ్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘మహారాణి’ సీజ‌న్ 4కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 

చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగిన రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) జీవిత ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే సిరీస్ ఇది. ఈ వ్య‌వ‌స్థ‌లో ఆమెకు ఎదురైన స‌వాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్ర‌లు, రాజ‌కీయ వైరుద్ధ్యాలు ఇందులో మ‌నం చూడొచ్చు. ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన గ‌త మూడు సీజ‌న్స్ త‌ర‌హాలోనే నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది.

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. టీజ‌ర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ రానున్న సీజ‌న్ 4పై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌ ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement