మాయ లేడి ప్రేమకథ  | Rakesh Varre Madhumita Sarkar Maya lady Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

మాయ లేడి ప్రేమకథ 

Nov 12 2026 4:46 AM | Updated on Nov 12 2026 4:46 AM

Rakesh Varre Madhumita Sarkar Maya lady Movie Pre Release Event

‘‘మాయ లేడి’ హీరో, నిర్మాత రాకేష్, డైరెక్టర్‌ ప్రశంకర్‌... నాకు మంచి మిత్రులు. నా ‘గూఢచారి’ సినిమాలో రాకేష్‌ నటించాడు. సినిమా పట్ల చాలా ΄్యాషన్‌తో ఉంటాడు. అలాగే ప్రశంకర్, నేను కలిసి కొన్ని స్క్రిప్ట్స్‌కు వర్క్‌ చేశాం. వీళ్లిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క తెలిపారు. రాకేష్‌ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మాయ లేడి’. ప్రశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుమిత సర్కార్‌ హీరోయిన్‌. 

క్రేజీ యాంట్స్‌  ప్రొడక్షన్స్‌ పై రూపొందిన ఈ మూవీ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్స్‌ శశికిరణ్‌ తిక్క, మహేశ్‌ బాబు పి. అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు .పి మాట్లాడుతూ– ‘‘కవలలను ప్రేమించిన ఓ కుర్రాడి కథే ‘మాయ లేడి’ చిత్రం. ఈ మూవీ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. రాకేష్, ప్రశంకర్‌లకు సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘కొత్త తరహా లవ్‌ స్టోరీతో మంచి ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రమిది’’ అన్నారు ప్రశంకర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement