శ్రవణ్, అనుష్క లూహార్, మలైకా, శివ నిర్వాణ, చింతాడ హేమారావు...
‘చకోర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ
‘‘ఇరుముడి’ హిట్ తర్వాత ఈ ‘చకోర’ వేడుక ద్వారా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి పూరీగారు పరశురామ్, నేను... ఇలా చాలామంది దర్శకులం అయ్యాం. ఇప్పుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీలో (ప్రేక్షకులు) ఉన్న ప్రతిభను గుర్తించండి. అప్పుడు మీరు కూడా మరో పూరి, శివ నిర్వాణ కాగలరు. ఇక ‘చకోర’లోని నటీనటులు ప్రామిసింగ్‌గా ఉన్నారు. టెక్నీషియన్స్ కూడా మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు.
మంగా శ్రీనివాస్ రచన– దర్శకత్వంలో శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా, అనుష్క లూహార్ ఓ హీరోయిన్‌గా డా. చింతాడ హేమారావు నిర్మించిన ‘చకోర–లూనార్ బర్డ్’ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో యూనిట్ నిర్వహించిన ప్రీ – రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ– ‘‘భిన్నమైన ప్రేమకథతో రూ పొందించిన ‘చకోర’ చూసి ప్రేక్షకులు అందించే ప్రశంసలు, కొట్టే చప్పట్లే మాకు కోట్లాది రూపాయల ఆస్తిగా భావిస్తాం’’ అన్నారు. మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఇదొక అమ్మ చెప్పిన ప్రేమకథ, ఒక అబ్బాయి ప్రేమకథ, అందమైన ప్రేమకథ. మా సినిమా ప్రివ్యూస్ చూసి, బ్యూటిఫుల్ ఫస్టాఫ్, వండర్‌ఫుల్ సెకండాఫ్ అంటున్నారు’’ అని చెప్పారు.


