– విశ్వదేవ్ రాచకొండ
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వంలో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వదేవ్ రాచకొండ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డార్క్ చాక్లెట్’లో యజ్ఞ అనే సినిమా హీరో పాత్ర చేశాను.
తను వరుసగా మూడు హిట్స్ కొట్టి, ఆ తర్వాత కొన్ని అపజయాలు చూసి డౌన్‌ఫాల్‌లో ఉంటాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. దాంతో ఫిల్మ్ ఛాంబర్ నుంచి అతన్ని బ్యాన్ చేస్తారు. దీంతో తనకు ఎవరూ అక్కర్లేదని, తానే అన్నీ చేసుకోవాలని నిర్ణయించుకుని కథ రాయడం మొదలుపెడతాడు. అతనికి పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. ఆ కలలేంటి? ఆ కలల్లోకి ఎవరు వస్తున్నారు? అన్నదే ఈ చిత్రకథ’’ అని పేర్కొన్నారు.


