నాడు గెలిచింది బాబు కాదు.. జగనే | Tammineni Veerabadram at the public meeting in Khammam | Sakshi
Sakshi News home page

నాడు గెలిచింది బాబు కాదు.. జగనే

Oct 6 2026 4:15 AM | Updated on Oct 6 2026 4:15 AM

Tammineni Veerabadram at the public meeting in Khammam

ఖమ్మంలో మీట్‌ ది ప్రెస్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం

ఏపీలో 2024 ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై వాస్తవాలకు దగ్గరగా ‘పరకాల’ సర్వే 

కొన్ని పోలింగ్‌ బూత్‌లలో నమోదైన ఓట్లకన్నా 500 ఓట్లు అదనంగా పడ్డట్లు స్పష్టమైంది 

1,500 ఓట్ల సామర్థ్యంగల బూత్‌లలో 2 వేల వరకు ఓట్లు లెక్కింపులోకి రావడం దారుణం 

ఈ సర్వే ప్రకారం గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోయి, ఓడాల్సిన వారు గెలిచారు 

ఓట్ల లెక్కింపులో తేడాల్లేవని.. ఇవన్నీ అవకతవకలేనని నిపుణులు నిర్ధారించారు 

లోక్‌సభ ఎన్నికల్లోనూ 79 స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయి... ఈవీఎంలలో అక్రమాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు 

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ అక్రమాలపై దేశవ్యాప్త చర్చతోపాటు చర్యలు అత్యవసరం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగానికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ప్రము ఖ సామాజికవేత్త పరకాల ప్రభాకర్‌ చేసిన సర్వే, విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇదంతా పరిశీలిస్తే నాడు గెలిచింది చంద్రబాబు నాయుడు కాదు.. జగన్‌మోహన్‌రెడ్డి అనేది ఒక అనాలసిస్‌. దీనిపై విశ్లేషకులు ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖ రాశారు’అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మంలో సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 

2024 ఎన్నికల్లో అక్రమాలు పెరిగాయి.. 
ఈవీఎంల నిర్వహణలో అక్రమాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్‌ ఏపీలో ఎన్నికల తీరుపై చేసిన సర్వేలో పలు అంశాలు బయటపడ్డాయన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలోని 1,400 పోలింగ్‌ బూత్‌లలో నమోదైన ఓట్ల వివరాలను పరిశీలిస్తే కొన్నింట 500 ఓట్లు అదనంగా పడ్డాయని స్పష్టమైందని చెప్పారు.

 1,500 ఓట్ల సామర్థ్యం ఉన్న బూత్‌లలో 2 వేల వరకు ఓట్లు లెక్కింపులోకి రావడం దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. సర్వేలో వెల్లడైన గణాంకాల ఆధారంగా విశ్లేíÙస్తే గెలవాల్సిన అభ్యర్థులు ఓడిపోవడం, ఓడాల్సిన వారు గెలవడం జరుగుతోందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై డేటా సైంటిస్టులు, నిపుణులు సమగ్ర పరిశీలన జరిపి, పర్సంటేజీ లెక్కల్లో లేదా లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని.. ఇవన్నీ అవకతవకలేనని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదించినట్లు తెలిపారు. 

కేంద్రంలోనూ ఇదే తీరు.. 
2024 సార్వత్రిక ఎన్నికల సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 79 పార్లమెంట్‌ స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని వీరభద్రం తెలిపారు. తద్వారా కేంద్రంలో ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈ అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ చేపట్టడమే కాకుండా తగిన చర్యలు అత్యవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, ఆర్థిక మార్పులపై ప్రస్తావిసూ అమెరికా సామ్రాజ్యవాదానికి సవాళ్లు ఎదురవుతున్నాయని.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా పెనుమార్పులు సంభవించబోతున్నాయని తెలిపారు. మీట్‌ ది ప్రెస్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement