చంద్రహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా, అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్‌లో నిర్వహించారు.
ఫిబ్రవరి 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ – ‘‘ఫిబ్రవరి 6న ‘బరాబర్ ప్రేమిస్తా’తో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నాను’’ అన్నారు. సంపత్ రుద్ర మాట్లాడుతూ – ‘‘ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఘర్షణ పడితే ఎలా ఉంటుంది? అనేదే మా సినిమా. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మకంగా సాగుతుంది’’ అని చెప్పారు.


