ఆరు నెలలు నరకం చూశా.. కంట్రోల్‌ చేసుకోలేక ఏడ్చేదాన్ని : నటి | Kiara Advani Get Emotional While SPeaking About Postpartum Journey | Sakshi
Sakshi News home page

ఆరు నెలలు నరకం చూశా.. కంట్రోల్‌ చేసుకోలేక ఏడ్చేదాన్ని: కియారా అద్వానీ

May 11 2026 12:04 PM | Updated on May 11 2026 2:36 PM

Kiara Advani Get Emotional While SPeaking About Postpartum Journey

తల్లి అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటుంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ. తాజాగా ఆమె ప్రముఖ పాడ్‌కాస్ట్‌ హోస్ట్ రాజ్ షమానికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భగా పోస్ట్‌పార్టమ్‌ (ప్రసవం తర్వాత తల్లి శరీరం, మానసిక స్థితిలో వచ్చే మార్పు) గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

‘పాప పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు నరకం చూశా. నాపై నాకే జాలి చూపించుకోవడం కష్టంగా అనిపించింది. చిన్న చిన్న విషయాలకే ఏడ్చేదాన్ని. నా భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోలేకపోయేదాన్ని. నా మనసులోని భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టింది. 

ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించిన నేను.. నా కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం మాతృత్వం నేర్పింది. ఈ కష్ట సమయంలో నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా చాలా సపోర్ట్‌ చేశాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రోజు రాత్రి నా దగ్గరకే వచ్చేవాడు.  డ్రైవ్‌కి తీసుకెళ్లేవాడు.  ఆ చిన్న డ్రైవ్స్‌ కూడా నాకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగించేవి’ అంటూ కియారా ఎమోషనల్‌ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

కాగా, కియారా, సిద్ధార్థ్‌లది ప్రేమ వివాహం. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులైలో కుమార్తె జన్మించింది.  కెరీర్‌ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా కియారా సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన టాక్సిక్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement