నినదిస్తా నిత్యం జనహితం | Bharat Ane Nenu first song released | Sakshi
Sakshi News home page

నినదిస్తా నిత్యం జనహితం

Mar 26 2018 12:14 AM | Updated on May 10 2018 12:13 PM

Bharat Ane Nenu first song released - Sakshi

మహేశ్‌బాబు

‘‘పాలించే ప్రభువును కానని, సేవించే బంటును నేనని.. అధికారం అర్థం ఇదని తెలిసేలా.. చేస్తా నా పని’’ అని ప్రజాప్రతినిధిగా హామీ ఇస్తున్నాడు భరత్‌ రామ్‌. అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి అని ప్రశ్నిస్తున్నాడు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్‌ అనే నేను’. ఇందులో కియారాఅద్వాని కథానాయిక. సీయం భరత్‌ రామ్‌ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రబృందం.

ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ను ఆదివారం  రిలీజ్‌ చేశారు.‘‘విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం.. దిస్‌ ఈజ్‌ మీ’’ అంటూ సాగే ఈ సాంగ్‌ శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన చిత్రం ఫస్ట్‌ లుక్, ఫస్ట్‌ ఓత్‌ అండ్‌ విజన్‌ ఆఫ్‌ భరత్‌కు మంచి స్పందన లభించింది. ఆదివారం రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సాంగ్‌కు ఆడియన్స్‌ రెస్పాన్స్‌ సూపర్‌. రామజోగయ్యశాస్త్రి రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్‌ వీనుల విందైన సంగీతం తోడైంది. డేవిడ్‌ సిమన్‌ అంతే అద్భుతంగా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement