ఉన్నవే 26 ఐమ్యాక్స్‌ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..? | Is Rajamouli Taking His Biggest Risk Yet With Varanasi? | Sakshi
Sakshi News home page

ఉన్నవే 26 ఐమ్యాక్స్‌ స్క్రీన్లు.. మరి జక్కన్న ప్లానేంటి..?

Aug 15 2026 1:47 PM | Updated on Aug 15 2026 1:58 PM

Is Rajamouli Taking His Biggest Risk Yet With Varanasi?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే వారణాసి చిత్రాన్ని పూర్తిగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తుండడంతో ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాపంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినిమాకు ఇది కొత్త దిశను చూపించే ప్రయత్నమా? లేక భారీ రిస్క్‌గా మిగిలిపోతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రేక్షకుల నుంచి ఆదరణ..
హాలీవుడ్‌లో క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌కు మంచి ఆదరణ తీసుకొచ్చింది. ప్రీమియం అనుభూతి కోసం ప్రేక్షకులు అధిక ధరలతో టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇండియాలోని ఐమ్యాక్స్‌ థియేటర్ల కొరత వెలుగులోకి వచ్చింది.
సాధ్యంకాని పనంటూ..
ప్రస్తుతం దేశవ్యాపంగా కేవలం 26 ఐమ్యాక్స్‌ స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్‌ చిత్రాలను రూపొందించడం ఎంతవరకు లాభదాయకమనే చర్చ కొనసాగుతోంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఒక్కో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఒక్క సినిమాని చూసి భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యకానిపని అన్నారు. 
ఐమాక్స్‌ చిత్రీకరణ ఎలా చేస్తారంటే..
ఐమాక్స్‌ చిత్రీకరణ సాధారణ సినిమాల మాదిరిగా ఉండదట. భారీ కెమెరాలు, ప్రత్యేక పరికరాలు, అనుభవంతులైన సాంకేతిక నిపుణులు అవసరమవుతారట. అంతేకాకుండా ఫ్రేమింగ్‌, లైటింగ్‌, సౌండ్‌ డిజైన్‌ వంటి అంశాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట..
ఐమ్యాక్స్‌ యుగానికి నాంది..
బాహుబలి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఇప్పుడు వారణాసితో మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న విధంగా విజయం సాధిస్తే భారతీయ సినీ పరిశ్రమలో ఐమ్యాక్స్‌ యుగానికి నాంది పలికే అవకాశముంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement