ఈ ఏడాది పెద్ది మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రూరల్ స్పోర్ట్ డ్రామాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోను మెరుగైన క్రీడాకారులను తయారు చేయవచ్చని ఈ సినిమాతో సందేశం ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో బుచ్చి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబుకు సంబంధించిన ఓ టాక్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. బుచ్చి ఏకంగా మెగాస్టార్ కోసం ఓ కథను సిద్ధం చేశారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన త్వరలోనే చిరును కలిసి కథ చెప్పనున్నారని ఇన్‌సైడ్ టాక్. దీంతో కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టమవుతోంది.
మరోవైపు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఫిల్మ్‌నగర్ టాక్. బుచ్చిబాబు మెగాస్టార్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేయలేదని సమాచారం. ఆయన కేవలం మైత్రి మూవీ మేకర్స్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్‌పైనే వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరికీ కూడా బుచ్చిబాబు కథను చెప్పడం లేదని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దసరా డైరెక్టప్ శ్రీకాంత్ ఓదెలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.


