‘కొత్త దర్శక,నిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు’! | Director Sheraz Mehdi Comments On Low Budget Movies | Sakshi
Sakshi News home page

‘కొత్త దర్శక,నిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు’!

Aug 15 2026 9:37 AM | Updated on Aug 15 2026 9:37 AM

Director Sheraz Mehdi Comments On Low Budget Movies

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు, నిర్మాతలు, చిన్న బడ్జెట్‌ సినిమాలు స్వేచ్ఛగా ఎదిగే అవకాశం లేకుండా పోతోందని సినీ నటుడు, దర్శకుడు షెరాజ్‌ మెహదీ ఆరోపించారు. చిన్న సినిమాల విషయంలో థియేటర్ల కేటాయింపు నుంచి ఓటీటీ, ఆడియో, శాటిలైట్, ఇతర భాషల హక్కుల వరకు అనేక సమస్యలున్నాయని, వీటిపై పరిశ్రమలోని పెద్దలు, స్టార్‌ హీరోలు స్పందించాలన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త దర్శకనిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం కాలేదన్నారు.  ఈ సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్న ఏషియన్‌ థియేటర్స్‌కు చెందిన సునీల్‌తో పాటు పీవీఆర్, ఐనాక్స్‌ యాజమాన్యాలకు లీగల్‌ నోటీసులు పంపినట్లు  తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement