'టాక్సిక్‌లో బోల్డ్‌ కంటెంట్'.. స్పందించిన హీరో యశ్ | Kannada Hero Yash Responds On Toxic Movie Trailer Bold Content | Sakshi
Sakshi News home page

Yash: 'టాక్సిక్‌లో బోల్డ్‌ కంటెంట్'.. స్పందించిన హీరో యశ్

Aug 15 2026 2:56 PM | Updated on Aug 15 2026 3:27 PM

Kannada Hero Yash Responds On Toxic Movie Trailer Bold Content

యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్‌ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే హీరో యశ్ స్పందించారు. టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన యశ్.. బోల్డ్ కంటెంట్ విమర్శలపై మాట్లాడారు. అసభ్యత తప్పేనని.. కానీ నేను ఇందులో కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. దానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. అది మాకు తెలుసని స్పష్టం చేశారు. ఇక్కడ సినిమా అంటే దృశ్యపరంగా ఆకట్టుకునేలా కనిపించాలని.. అదే ఒక క్రియేటర్‌ గొప్పతనం అని అన్నారు.

ప్రస్తుతం మీ సినిమాలపై జెన్ జీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని యశ్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ప్రతి పాత తరం వారు యువతరం తప్పు చేస్తోందని భావిస్తుంటారని తెలిపారు. తన చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement