మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా.. ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందిస్తూనే ఉంది. తాజాగా ఓ రైలులో మహిళను కొడుతున్న వీడియోపై స్పందించింది. చిన్నారిని ఎత్తుకుని ఉన్న మహిళను కొందరు విచక్షణారహితంగా కొడుతున్న వీడియోను చూసి రియాక్ట్ అయింది. ఇలాంటి వాళ్లను కచ్చితంగా జైలులో వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ మహిళ ఏం చేసిప్పటికీ.. చిన్న బిడ్డను పట్టుకున్నప్పుడు ఆమెను కొట్టడం చాలా క్రూరమైన చర్య అంటూ మండిపడింది. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొట్టాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
No matter what she has done, beating her while she holds the baby is absolutely cruel, these people deserve to be in jail and beaten up! https://t.co/OgrbWJpt1m
— Lavanya tripathi konidela (@Itslavanya) August 15, 2026


