శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా, టైటిల్‌ ఇదే | Srihari Son Meghamsh Srihari Returns As Lead Actor With Mythological thriller Aasmaa | Sakshi
Sakshi News home page

శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా, టైటిల్‌ ఇదే

Apr 5 2026 11:12 AM | Updated on Apr 5 2026 1:19 PM

Srihari Son Meghamsh Srihari Returns As Lead Actor With Mythological thriller Aasmaa

దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఆస్మాన్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. రామ్‌ నందన్‌ దర్శకత్వంలో కొండారు వెంకటేశ్, శ్రీకాంత్‌ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శనివారం జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్‌ క్లాప్‌ ఇవ్వగా, సందీష్‌ కిషన్‌ స్విచ్చాన్‌ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించగా, తొలి సన్నివేశానికి రామ్‌ నందన్‌ దర్శకత్వం వహించారు. విశ్వక్‌ సేన్, రోషన్‌ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్‌ తాళ్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేఘాంశ్‌ శ్రీహరి మాట్లాడుతూ–‘‘రామ్‌ నందన్‌ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్‌బస్టర్‌ కొట్టబోతున్నాం’’ అని చెప్పారు. ‘‘తెలుగులో నాకు ‘ఆస్మాన్‌’ తొలి చాన్స్‌. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌తో రాబోతున్నాం. మూడు షెడ్యూల్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అని తెలిపరు రామ్‌ నందన్‌.

‘‘మేఘాంశ్‌ శ్రీహరితో మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్‌ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్‌ మన్నెం. ‘‘మూడేళ్ల క్రితం మా నిర్మాణ సంస్థను స్టార్ట్‌ చేశాం. అప్పట్నుంచి కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణగారి స్టూడెంట్‌ అయిన రామ్‌నందన్‌ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్‌లో సినిమా చేశారు. ‘ఆస్మాన్‌’ సస్పెన్స్‌–థ్రిల్లర్‌గా ఉంటుంది’’ అని చెప్పారు వెంకటేశ్‌ కొండారు. కెమెరామెన్‌ షోయబ్‌ మాట్లాడారు. ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement