ప్రభాస్ ఫౌజీ.. వారికి సీరియస్ వార్నింగ్..! | Makers of Prabhas Fauzi team issue strict warning after pictures from set | Sakshi
Sakshi News home page

Fauzi Movie:: ప్రభాస్ ఫౌజీ.. మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Apr 5 2026 11:09 AM | Updated on Apr 5 2026 1:16 PM

Makers of Prabhas Fauzi team issue strict warning after pictures from set

రెబల్ స్టార్ పాన్‌ ఇండియా రేంజ్‌లో వస్తోన్న చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌.

పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫౌజీ టీమ్ కొందరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఫౌజీ సెట్స్‌ నుంచి లీకైన చిత్రాలను కొన్ని ఖాతాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలా కంటెంట్‌ను లీక్ చేసేవారికి మా హెచ్చరిక.. ఎవరైనా సరే చర్యలు తప్పవని ఫౌజీ టీమ్ హెచ్చరించింది.  మేము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాకు ఈ లీకులు దెబ్బతీస్తున్నాయని ట్వీట్ చేశారు. లీక్ కంటెంట్‌ను షేర్ చేయకుండా దూరంగా ఉండాలని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నామంటూ పోస్ట్ చేసింది.

దీనిపై దర్శకుడు హను రాఘవపూడి సైతం స్పందించారు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి లీకులతో మా కష్టాన్ని వృథా చేయొద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దయచేసి సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దామని హను రాఘవపూడి విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్‌ పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భానుచందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement