‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్‌లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు.
‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్‌గార్లు మా సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ.


