అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్‌’కు రూ. కోటి! | Alappuzha woman finds her ₹1 crore lottery ticket in trash | Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్‌’కు రూ. కోటి!

Apr 5 2026 12:49 PM | Updated on Apr 5 2026 1:54 PM

Alappuzha woman finds her ₹1 crore lottery ticket in trash

అలప్పుజ: అదృష్టం తలుపు తట్టడమే కాదు.. ఒక్కోసారి చెత్తబుట్టలో నుంచి కూడా పలకరిస్తుందని కేరళకు చెందిన ఓ మహిళ విషయంలో నిరూపితమయ్యింది. తెలియక పారేసిన లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తృటిలో చేజారిన మహాభాగ్యం తిరిగి దక్కిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడి పంచాయతీ పరిధిలోని ఎడతువా ప్రాంతానికి చెందిన కుంజమ్మ అనే మహిళ, అంబలప్పుజా-తిరువల్లా రాష్ట్ర రహదారి పక్కన ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. రోజూవారీ వ్యాపారంతో పాటే ఆమె స్థానికంగా ఉండే జార్జ్‌కుట్టి అనే లాటరీ విక్రేత వద్ద రెండు ‘కారుణ్య’ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. గురువారం నాడు లాటరీ ఫలితాలు వెలువడగా, కుంజమ్మ ఎంతో ఆసక్తిగా తన వద్ద ఉన్న లాటరీ నంబర్లను ఫలితాలతో సరిచూసుకున్నారు. అయితే తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి మాత్రమే రూ. 5,000 కన్సోలేషన్ బహుమతి వచ్చినట్లు ఆమె గమనించారు. తనకు దక్కిన అదృష్టం అంతేనని సరిపెట్టుకున్న కుంజమ్మ, రెండో టికెట్‌కు ఎలాంటి బహుమతీ రాలేదని భావించి, దానిని తన దుకాణంలో ఉన్న చెత్తబుట్టలో పారేశారు.

అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. లాటరీ ఫలితాలను నిశితంగా గమనించిన కుంజమ్మ సోదరుడు ఆమెకు ఒక కళ్లు చెదిరే వార్తను చెప్పారు. పనికిరాదని ఆమె చెత్తలో పారేసిన ఆ రెండో టికెట్‌కే ఏకంగా రూ. ఒక కోటి మొదటి బహుమతి వరించిందన్నాడు. ఆ మాట విన్న వెంటనే కుంజమ్మకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని తానే స్వయంగా చెత్తపాలు చేశానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రాత్రికి రాత్రే తన సోదరుడిని వెంటబెట్టుకుని ఆమె తిరిగి తన దుకాణానికి పరుగులు తీశారు. ఇద్దరూ కలిసి  ఆ చెత్తబుట్టలో వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. చెత్తలో పారేసిన ఆ కోటి రూపాయల లాటరీ టికెట్ ఎట్టకేలకు  దొరికింది. అది చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన స్థానికుంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement