రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే.. | Woman On Leaving Rs 50 Lakh Job For Content Creation | Sakshi
Sakshi News home page

రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..

Apr 5 2026 1:24 PM | Updated on Apr 5 2026 4:31 PM

 Woman On Leaving Rs 50 Lakh Job For Content Creation

మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్‌ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్‌ అయిన విధానాన్ని నెట్టింట షేర్‌ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్‌కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.

ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్‌ క్రియేషన్‌ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్‌ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్‌లు గురించి హైలెట్‌ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. 

ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్‌ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్‌ క్రియేషన్‌ అన్నది సరైన కెరీర్‌ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. 

అంతేగాదు కంటెంట్‌ను క్రియేట్‌ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్‌ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. 

చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్‌ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్‌..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్‌ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. 

 

(చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే విస్తుపోతారు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement