నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్బంగా రణబాలి మూవీ టీమ్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతు మేకింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో రష్మిక భర్త విజయ్ దేవరకొండ కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ ఐ లవ్ యూ జయమ్మ అని క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఈ చిత్రం రానున్నడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరోసారి హిట్ కొట్టేందుకు బలమైన కథన రెడీ చేసుకున్నాడు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు.


