హీరో వెంకటేష్‌ మెచ్చిన 'బటర్‌ దోసె'..! ఎలా చేస్తారంటే.. | Bengaluru restaurant where Telugu superstar Venkatesh recently dined, | Sakshi
Sakshi News home page

హీరో వెంకటేష్‌ మెచ్చిన 'బటర్‌ దోసె'..! ఎలా చేస్తారంటే..

Apr 5 2026 2:47 PM | Updated on Apr 5 2026 3:42 PM

Bengaluru restaurant where Telugu superstar Venkatesh recently dined,

దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్‌ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్‌ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్‌. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్‌ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్‌లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్‌ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్‌ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. 

 

దోసె వెనుకున్న వారసత్వం..
ఆ రెస్టారెంట్‌ని అరుణ్‌ కుమార్‌ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్‌ ఈ దోసె. ఈ రెస్టారెంట్‌ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్‌ దీనిని స్థాపించారు. 

1970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్‌ నటుడు హీరో వెంకటేశ్‌ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్‌ గురించి నెట్టంట సంచలనంగా మారింది. 

రెస్టారెంట్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్‌ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్‌ని సందర్శించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. వెంకటేశ్‌ అక్కడ బటర్‌ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్‌ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్‌ఫాస్ట్‌ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

(చదవండి: కంటెంట్‌ క్రియేటర్‌ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..)
 

Advertisement
 
Advertisement
Advertisement