రియల్ స్టార్ శ్రీహరి తనయుడు హీరోగా ‘స్టూడెంట్‌’.. లుక్‌ అదిరింది | Meghamsh Srihari First Look Released From Student Movie | Sakshi
Sakshi News home page

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు హీరోగా ‘స్టూడెంట్‌’.. ఫస్ట్‌లుక్‌ అదిరింది

Jun 23 2026 6:41 PM | Updated on Jun 23 2026 6:52 PM

Meghamsh Srihari First Look Released From Student Movie

దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త  సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు ‘స్టూడెంట్’ సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ ఈ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి.

 'ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు' అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. 'ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..' అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి.‘స్టూడెంట్’ సినిమా మేఘాంశ్ శ్రీహరి కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీగా రాబోతుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement