ప్రభాస్ బర్త్ డే.. ఇదే బెస్ట్ విషెస్ ఏమో! | Prabhas Birthday Prashanth Neel Wife Post Latest | Sakshi
Sakshi News home page

Prabhas Birthday: దర్శకుడికి భార్యకు ప్రభాస్ ముద్దు.. ఫొటో వైరల్

Oct 23 2026 3:57 PM | Updated on Oct 23 2026 4:04 PM

Prabhas Birthday Prashanth Neel Wife Post Latest

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు విషెస్ చెబుతున్నారు. అందరూ డార్లింగ్ హీరోతో తమకున్న బాండింగ్ బట్టి పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య మాత్రం సర్‌ప్రైజింగ్ ఫొటో సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులే షాకవుతున్నారు.

(ఇదీ చదవండి: ‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ సిరీస్ రివ్యూ)

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' చేశారు. దీనికి కొనసాగింపుగా రెండో భాగం కూడా తీయాల్సి ఉంది. అయితే 'సలార్' షూటింగ్ టైం నుంచే నీల్ కుటుంబంతో ప్రభాస్‌కి బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నీల్ భార్య లిఖిత.. '‍హ్యాపీ బర్త్ డే టూ మై ఫౌజీ' అని ప్రభాస్, తనకు బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటోని పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభాస్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? బెస్ట్ విషెస్ ఇదేనేమో అని మాట్లాడుకుంటున్నారు.

ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం 'ఫౌజీ', స్పిరిట్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఫౌజీ ముందు రానుంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రిలీజ్ కావాలి. కానీ వచ్చే మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు. ఇక మార్చిలో రావాల్సిన 'స్పిరిట్'.. వచ్చే అక్టోబర్ 27న విడుదల కానుందని ప్రకటించారు. మరోవైపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చిన తెలుగు సినిమా.. నాలుగు నెలలకు స్ట్రీమింగ్)

SS

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement