ప్రభాస్ సినిమాల్లో మొదటగా రాబోయేది 'ఫౌజీ'. డిసెంబరు 3న థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్లింప్స్, టీజర్ లాంటిది ఏమైనా ఉంటుందేమోనని అభిమానులు ఆశపడ్డారు. కానీ మూవీ టీమ్ మాత్రం పోస్టర్‌తోనే సరిపెట్టేసింది. ఈ మేరకు దానిని సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ పోస్టర్‌లో చార్మినార్ దగ్గర గాంధీజీ నడుచుకుంటూ వెళ్తుండగా మరోవైపు ఒంటిపై రక్తంతో ప్రభాస్ ఉన్నాడు. కాకపోతే ప్రభాస్ ముఖాన్ని చూపించలేదు. 'స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంతా సంబరాలు చేసుకున్నారు కానీ దానికంటే ముందు పెద్ద యుద్ధమే జరిగింది. రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడికి సెల్యూట్' అని ఈ పోస్టర్‌కి క్యాప్షన్ జోడించారు.
'సీతారామం' తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదో ప్రీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీ అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే గత ఏడేళ్లుగా ఇన్ స్టాలో డీపీ మార్చని ప్రభాస్.. రీసెంట్‌గానే 'ఫౌజీ' పోస్టర్‌ని డీపీ పెట్టాడు. దీంతో ఈ మూవీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతుందని అభిమానులు అనుకుంటున్నారు.


