'చైనా పీస్' కాదు ఇకపై 'సీక్రెట్ సోల్జర్'.. రిలీజ్‌కి రెడీ | China Piece Movie Titled Secret Soldier And Release Date | Sakshi
Sakshi News home page

'చైనా పీస్' కాదు ఇకపై 'సీక్రెట్ సోల్జర్'.. రిలీజ్‌కి రెడీ

Aug 1 2026 6:10 PM | Updated on Aug 1 2026 6:18 PM

China Piece Movie Titled Secret Soldier And Release Date

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తీసిన యూనిక్ స్పై డ్రామా సినిమా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ క్రియేట్ చేసింది. టీజర్ అంచనాలను మరింత పెంచింది. ఇంతకుముందు 'చైనా పీస్' పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రం.. ఇప్పుడు 'సీక్రెట్ సోల్జర్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేశారు. కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement