కాక్రోచ్‌ జనతా పార్టీ కీలక ప్రకటన.. ఢిల్లీలో భారీ ర్యాలీ | Cockroach Janata Party holds huge rally in Delhi | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ జనతా పార్టీ కీలక ప్రకటన.. ఢిల్లీలో భారీ ర్యాలీ

Aug 24 2026 8:00 PM | Updated on Aug 24 2026 8:04 PM

Cockroach Janata Party holds huge rally in Delhi

సాక్షి, ఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది.విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల రద్దుకై కేంద్రం వ్యవహారిస్తున్న వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్ వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్రం హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపింది.

ఏం జరిగింది?

నీట్‌పేపర్‌ లీకేజ్‌కు నిరసనగా జూలై 20న జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన విద్యార్థుల “సంసద్‌ చలో” నిరసన పార్లమెంట్‌ వైపు వెళ్లడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులను ఆపేందుకు లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ వంటి చర్యలు చేపట్టారు. నిరసనకారులు పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం, బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడం, ఘర్షణలు జరగడం వంటి కారణాలతో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే ఆందోళనల విరమణలకై జరిగిన ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నందున సెప్టెంబర్‌ 5 న.. యువజన మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement