25 ఏళ్లకే కోటీశ్వరుడిగా అవతరించిన ఒక యువకుడు రెడ్డిట్‌లో తన ఆకట్టుకునే పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను పంచుకున్నారు. మీమ్ పేజీలు, ఆన్‌లైన్ కంటెంట్‌పై కేంద్రీకృతమైన వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా తాను రూ. 1.6 కోట్ల నికర సంపదను కూడబెట్టినట్లు ఆయన వెల్లడించారు.అయితే తన ఆదాయం బిజినెస్ ఆధారితం కావడం వల్ల హెచ్చుతగ్గులు ఉంటాయని, అందువల్ల భవిష్యత్తు కోసం (FIRE - Financial Independence, Retire Early) ఎలాంటి వ్యూహాలు పాటించాలో అని సలహాలు కోరిన వైనం నెట్టింట సందడిగా మారింది. అంతేనా అతను షేర్ చేసిన నెట్‌వర్త్ పోర్ట్‌ఫోలియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
భారతదేశంలోని ఒక టైర్-2 నగరానికి చెందిన డిజిటల్ మీడియా బిజినెస్‌లో రాణిస్తున్న ఈ బిజినెస్‌మ్యాన్ సోషల్ మీడియాలో తన సక్సెస్ జర్నీని షేర్ చేశాడు. పెట్టుబడి విషయంలో తాను అనుసరించిన క్రమశిక్షణా విధానమే తన ఆర్థిక బలానికి, కోటిన్నర ఆర్థిక మైలురాయిని దాటడానికి సాయపడిందని యువ క్రియేటర్ వివరించారు. తాను 18 ఏళ్ల వయస్సులోనే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆర్జన మొదలు పెట్టి, చివరికి ఒక డిజిటల్-మీడియా వ్యాపారాన్ని నిర్మించానని వివరించాడు. తన ఆస్తులు,పెట్టుబడుల వివరాలను కూడా పంచుకున్నాడు. ప్రస్తుత నికర సంపద సుమారుగా రూ. 1.6 కోట్లు అని , తనకు రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని తెలిపాడు. అయితే తనకు గానీ, తన తల్లిదండ్రులకు గానీ ఆరోగ్య బీమా లేదని ప్రకటించాడు. రెండేళ్ల క్రితం రూ. 4 లక్షలతో సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేశాడు.
ఆస్తి, పెట్టుబడులు
మొత్తం ఆస్తి: రూ.1.6 కోట్లు
భారతీయ ఈక్విటీలు : రూ 90 లక్షలు
బ్యాంక్ డిపాజిట్లు & క్యాష్ రూ. 45 లక్షలు
రియల్ ఎస్టేట్ (Real Estate)రూ.15 లక్షలు
యూఎస్ స్టాక్స్ : రూ 7.5 లక్షలు
మ్యూచువల్ ఫండ్స్ : రూ 5 లక్షలు
క్రిప్టో & ఫిక్స్డ్ డిపాజిట్లు : రూ 4 లక్షలు
రెడిటర్లను అడిగిన ప్రశ్నలు
వ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూనే ఉన్నప్పటికీ, తర్వాత ఏమి చేయాలా అంటూ ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకే భవిష్యత్తులో తన సంపద కరిగిపోకుండా, మరింత ఆర్థిక స్థిరత్వం కోసం,డిజిటల్ మీడియా బిజినెస్‌ను మరింతగా స్కేల్ చేయడం ఎలా? ఎలాంటి వ్యూహాలు పాటించాలో తెలపండి నెటిజన్లను సలహాలు కోరాడు. ముఖ్యంగా గత రెండుమూడేళ్లుగా రియల్ ఎస్టేట్ డీల్స్ పెద్దగా లేవు, కనుక బ్యాంక్‌లో ఉన్న రూ. 30-45 లక్షల మిగులు నగదును ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పండి అంటూ నెటిజన్లకు విజ్ఞప్తి చేయడం విశేషం.
ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్
నెటిజన్ల స్పందన
25 ఏళ్లకే ఇంత గొప్ప ఆర్థిక విజయాన్ని సాధించినందుకు పలువురు అభినందించారు."నిజంగా అద్భుతం, మిత్రమా అంటూ తెగ పొగిడేవారు. ఒక యూజర్ మీమ్ పేజీల ద్వారా సంపాదన ఎలా సాధ్యమో తెలపండి అంటూ ఆసక్తి చూపగా, మరికొందరు రియల్ ఎస్టేట్ ఆస్తులను కొని అమ్మడం లేదా కొన్నింటిని అద్దెకు ఇవ్వడం ప్రారంభించి, మీ డిజిటల్ వ్యాపారాన్ని నడుపుతూనే నెమ్మదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించండి. తద్వారా నిలకడైన ఆదాయం పొందాలని సూచించారు.
ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు


