సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సంచలన లేఖ | Ex CJI Gavai Writes To President Lack Of Diversity Judges Appointments | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సంచలన లేఖ

Nov 27 2026 5:40 PM | Updated on Nov 27 2026 5:51 PM

Ex CJI Gavai Writes To President Lack Of Diversity Judges Appointments

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సంచలన లేఖ రాశారు. కొలీజియం సిఫార్సులపై జస్టిస్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మూడు పేజీల లేఖ రాశారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల సిఫార్సుల్లో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిభ, వైవిధ్యాన్ని పక్కనపెట్టి ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. 

దేశ జనాభాలో 5 శాతం కంటే తక్కువ ఉన్న వర్గానికి సుప్రీంకోర్టులో 40% పైగా ప్రాతినిధ్యం ఇస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణాలకూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షాత్మక బదిలీలకు గురైన జడ్జీలకు ప్రముఖ హైకోర్టుల సీజేలుగా పదోన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు. కొలీజియం సిఫార్సులకు జవాబుదారీతనం ఉండాలని, రాష్ట్రపతి తన రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement