ప్రభుత్వ బడుల పరిస్థితులేంటి? అభిజిత్ దీప్కే లేఖ | Abhijit Deepke wrote a letter to the education ministers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల పరిస్థితులేంటి? అభిజిత్ దీప్కే లేఖ

Aug 24 2026 4:36 PM | Updated on Aug 24 2026 5:03 PM

Abhijit Deepke wrote a letter to the education ministers

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ‍ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కాక్రోచ్‌ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు లేఖ రాశారు.   ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేవని దీంతో దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని లేఖలో ప్రశ్నించారు.? ప్రజా విద్యను ప్రాధాన్యతగా తీసుకొని పాఠశాలలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అభిజిత్‌ దీప్కే ప్రస్తుత సమస్యను పరిష్కరించే ముందు ప్రస్తుత పరిస్థితి గురించి సమాచారం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీంతో  మీ మంత్రిత్వ శాఖ కింది వివరాలను బహిరంగంగా అందించాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  కింది పది పాయింట్లను వివరాలు అందించాలని కోరారు. 
 

  •     గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించబడ్డాయి? ప్రస్తుతం ఎన్ని మరమ్మతులు లేదా పూర్తి                     పునర్నిర్మాణం  అవసరం.
  •     ప్రస్తుతం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయబడ్డాయి? ఎన్ని భర్తీ అయ్యాయి? ఎన్ని ఖాళీగా ఉన్నాయి.
  •     గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎంత నిధులు కేటాయించబడ్డాయి? అందులో ఎంత ఖర్చు చేశారు?
  •    ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యకు సహేతుకమైన ప్రాప్యత ఉండేలా ఎన్ని అదనపు ప్రభుత్వ పాఠశాలలు అవసరం
  •    బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఏ ఏ బోధనేతర విధులు, బాధ్యతలు అప్పగించబడ్డాయి?
  •    ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, శుభ్రమైన పనిచేసే టాయిలెట్లు,
        సరైన క్రీడా సౌకర్యాలు & పరికరాలు ఉన్నాయి?


    అని అన్నిరాష్ట్రాల విద్యాశాఖలను ప్రశ్నించారు. ఇది రాజకీయం గురించి కాదని కేవలం  విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమేనని లేఖలో పేర్కొన్నారు.ప్రతి విద్యార్థికి సురక్షితమైన తరగతి గది, శుభ్రమైన తాగునీరు, పనిచేసే టాయిలెట్, కూర్చోవడానికి బెంచీ, బోధించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కోరారు.మీ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని బహిరంగం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement