ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో మార్పులు | Changes to Intermediate Public Examinations | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో మార్పులు

Oct 16 2026 5:25 AM | Updated on Oct 16 2026 5:25 AM

Changes to Intermediate Public Examinations

జనరల్‌ విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్‌.. బయాలజీ పరీక్షకు ఒకే ఓఎంఆర్, 40 పేజీల బుక్‌లెట్‌

ఎలక్టివ్‌ సబ్జెక్టులకు ప్రత్యేక ప్రశ్నపత్రాలు.. మార్చి–2027 పరీక్షల్లో ఇంటర్‌ బోర్డు మార్పులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి–2027లో జరిగే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టారు. ఇకపై పరీక్షల్లో జనరల్, జువాలజీ సబ్జెక్టులకు వేర్వేరు బుక్‌లెట్లను ప్రవేశ­పెడుతున్నారు. జనరల్‌ థియరీ సబ్జెక్టులన్నింటికీ ఇకపై ఏకరూపతతో కూడిన 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను అందిస్తారు. ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు మాత్రం గతంలో ఉన్న 24 పేజీల బుక్‌లెట్‌ విధానమే కొనసాగుతుంది.

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల బయాలజీ పరీక్షకు గతంలో బోటనీ, జువాలజీలకు వేర్వేరుగా ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్ల విధానాన్ని రద్దు చేశారు. వాటి స్థానంలో ఒకే ఓఎంఆర్‌ షీట్‌తో పాటు 40 పేజీల సమాధాన బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే, పార్ట్‌–2 పరిధిలోని కోర్‌ ఎలక్టివ్‌ సబ్జె­క్టుౖ­లెన మ్యా­థమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయా­లజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టు­లకు సంబంధించి మొదటి, రెండో ఏడాది విద్యా­ర్థులకు వేర్వే­రుగా ప్రత్యేక ప్రశ్నాపత్రాలను అందించ­నున్నారు. ఇటీవల జరిగిన 78వ బోర్డు సమా­వేశం నిర్ణయాల మేరకు పరీక్షా విధానంలో మార్పులు చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి పి.రంజిత్‌ బాషా వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement