‘నువ్వు చనిపోతే బాగుంటుంది’ అంటూ దూషణలు! | Jensen Huang Accused Of Explosive Office Outbursts | Sakshi
Sakshi News home page

‘నువ్వు చనిపోతే బాగుంటుంది’ అంటూ దూషణలు!

Nov 15 2026 6:05 PM | Updated on Nov 15 2026 6:12 PM

Jensen Huang Accused Of Explosive Office Outbursts

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై మరి​కొన్ని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బయటకు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించే ఆయన.. తన కార్యాలయంలో మాత్రం ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారని, వారి అంతర్గత సమావేశాల్లో సీనియర్ అధికారులను సైతం బహిరంగంగా దూషించేవారని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 మందికి పైగా ఎన్విడియా ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో అప్పటి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జే పురిపై హువాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందులో హువాంగ్ మాట్లాడుతూ.. ‘నీకు ఫ్లూ రావాలి.. అది మరింత తీవ్రమవ్వాలి. నువ్వు చనిపోతే మాకందరికీ ఈ బాధ తప్పుతుంది’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు ఆ కథనం పేర్కొంది.

అంతేకాదు 2025లో జరిగిన మరో సమావేశంలో ఓ సీనియర్ సేల్స్ అధికారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలున్నాయి. మరో సందర్భంలో తనను చూసి నవ్వుతున్నావా? అంటూ ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో సమావేశం సందర్భంగా ఓ సీనియర్ అధికారిపై వాటర్ బాటిల్ విసిరినట్లు కూడా కథనం పేర్కొంది.

హువాంగ్ జీవిత చరిత్ర రచయిత స్టీఫెన్ విట్ సైతం ఆయనకు భిన్నాభిప్రాయాలతో పాటు ఇతరుల సలహాలను కూడా సహించలేని స్వభావం ఉందని, చిన్నపాటి పొరపాట్లకే ఉద్యోగులపై తీవ్రంగా అరుస్తారని తన కథనంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్ ఇష్యూ.. 'మెగాస్పీడ్' ఫస్ట్‌ రియాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement