ప్రియుడిని అంతం చేయాలని ప్లాన్‌ చేసి అడ్డంగా దొరికిన ప్రియురాలు | Kerala Teenager Hires Friends To Kidnap, Rob | Sakshi
Sakshi News home page

 ప్రియుడిని అంతం చేయాలని ప్లాన్‌ చేసి అడ్డంగా దొరికిన ప్రియురాలు

Nov 14 2026 12:57 AM | Updated on Nov 14 2026 12:57 AM

Kerala Teenager Hires Friends To Kidnap, Rob

కేరళలో ప్రేమ పేరుతో జరిగిన ఒక దారుణమైన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడిని వదిలించుకోవడానికి ఓ 19 ఏళ్ల యువతి స్వయంగా తన స్నేహితుల సహాయంతో కిడ్నాప్, దోపిడీ హత్యకు ప్లాన్ వేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, అన్ని ప్రయత్నాలను ఎదుర్కొని ఆ యువకుడు ప్రాణాలతో బయటపడటంతో ఈ షాకింగ్ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది.

పట్టాంబికి చెందిన యువకుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు అర్ధరాత్రి సమయంలో కేరళలోని తిరుర్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే, ఆమె అప్పటికే తన ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలని పథకం పన్నింది.

యువకుడు అక్కడకు చేరుకోగానే, ఆ యువతి పరిచయస్తుడైన ఒక వ్యక్తి అతన్ని కలిసి తన స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్తానని బైక్‌పై ఎక్కించుకుని నమ్మించి మోసం చేశాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం మరికొందరు దుండగులు అక్కడకు చేరుకున్నారు. వారంతా కలిసి ఆ యువకుడిని బలవంతంగా ఒక కారులో ఎక్కించారు.  

కారులోనికి లాక్కెళ్లిన నిందితులు అతన్ని తీవ్రంగా కొట్టి, భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్,విలువైన వస్తువులను దోచుకున్నారు. తమ ప్రేమకు, సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కక్షతో ఆ యువకుడిని హత్య చేయాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి  సమయంలో తాజెపళం వద్ద ఉన్న నదీతీర ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తీవ్రంగా హింసించి, చనిపోయి ఉంటాడని భావించి అతన్ని రోడ్డు పక్కన పడేసి పరారయ్యారు.  

దుండగులు తమ పని ముగిసిందని భావించినప్పటికీ, తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తేరుకున్న వెంటనే అతను ధైర్యం చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశాడు.

యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన తిరుర్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ కిడ్నాప్, హత్యాయత్నం వెనుక ప్రియురాలితో పాటు ఆమె స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల్లో ఇర్షాద్, అసారుద్దీన్ వంటి వ్యక్తులు ఇదివరకే డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యాయత్నాలు,  పలు హింసాత్మక కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రేమ పేరుతో నమ్మించి ప్రియుడినే కడతేర్చాలని చూసిన ఈ కిరాతక ఘటన కేరళలో సంచలన సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement