నా పిల్లలకు మాత్రం ఐఏఎస్‌ వద్దు | ias officer tukaram mundhe doesnt want his children to join civil services | Sakshi
Sakshi News home page

Tukaram Mundhe: నా పిల్లలకు మాత్రం ఐఏఎస్‌ వద్దు

Oct 23 2026 5:39 PM | Updated on Oct 23 2026 6:25 PM

ias officer tukaram mundhe doesnt want his children to join civil services

భారత సమాజంతో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకున్నా గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది భారతీయ కుటుంబాల్లో ఐఏఎస్‌ అధికారి కావడం అనేది అత్యున్నత కెరీర్‌ లక్ష్యంగా భావిస్తారు. తమ పిల్లలు కూడా సివిల్‌ సర్వీసుల్లో చేరాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఐఏఎస్‌ అధికారిగా సమాజంలో తన ప్రత్యేకత చాటుకున్న తుకారం ముండే మాత్రం తన పిల్లలను సివిల్‌ సర్వీస్‌లో చేర్చడం ఇష్టం లేదంటున్నారు. దానికి కారణం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. 

ఐఏఎస్‌ అధికారి తుకారాం ముండే  ఇటీవల  గ్లోబల్‌ మరాఠా బిజినెస్‌ ఎక్స్‌పోలో పాల్గొని  కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాట్లాడుతూ.. "తన పిల్లలు పారిశ్రామికవేత్తలుగా లేదా ప్రజా నాయకులుగా ఎదిగి, మరింత స్వేచ్ఛతో సమాజానికి సేవ చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు". సూమారు 21 ఏళ్ల సర్వీసులో 25 సార్లు బదిలీలను ఎదుర్కొన్న అనుభవమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ బదిలీల ప్రభావం ఆయన ఉద్యోగ జీవితానికే పరిమితం కాకుండా కుటుంబ జీవితంపైనా పడినట్లు ముండే తెలిపారు.

పిల్లల చదువుపై బదిలీల ప్రభావం
తుకారాం ముండే తన పిల్లలను సివిల్‌ సర్వీసుల్లోకి రావద్దని సూచించడానికి ప్రధాన కారణం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించడంతో తరచూ నివాసం మారాల్సి రావడమే అన్నట్లు తెలుస్తోంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడం, కొత్త ప్రాంతాలకు అలవాటు పడటం, పిల్లల చదువును కొనసాగించడం వంటి విషయాలు ఆయనను తరచుగా ఇబ్బందులకు గురిచేసింది.

ముఖ్యంగా, ఆయన కుమారుడు ఐదో తరగతిలోకి రాకముందే ఆరుసార్లు పాఠశాలలు మారాల్సి వచ్చిందని పలు కథనాలు వెల్లడయ్యాయి. తన పోస్టింగులకు అనుగుణంగా కుటుంబ జీవితాన్ని పదేపదే మార్చుకోవాల్సి రావడంతో, తన భార్య కూడా అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించినట్లు సమాచారం.

ఇదీ చ‌ద‌వండి: అవే ఆయన నాతో చివరిగా అన్న మాటలు

సాధారణంగా పిల్లల విషయంలో ఇటువంటి మార్పులు తీవ్రంగా ప్రభావం చూపుతాయి. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారినప్పుడు స్నేహితులను, పరిచయమున్న ఉపాధ్యాయులను, అలవాటైన వాతావరణాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. కొత్త పాఠశాలలో మళ్లీ అలవాటు పడటం, కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం, చదువులో కొనసాగింపును కాపాడుకోవడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఐఏఎస్‌ ఉద్యోగం అధికారంతో, ఉద్యోగ భద్రతతో కూడినదిగా కనిపించినప్పటికీ, ఆ ఉద్యోగాన్ని నిర్వహించే వ్యక్తి కుటుంబం కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ముండే అనుభవం తెలియజేస్తోంది.

ఎవరీ తుకారాం ముండే?
తుకారాం ముండే మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2005 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. నిబంధనలను కఠినంగా అమలు చేయడం, వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహించడం, తరచూ బదిలీలను ఎదుర్కోవడం వంటి కారణాలతో ఆయన మహారాష్ట్ర అధికార వర్గాల్లో గుర్తింపు పొందారు. మున్సిపల్‌ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి విభాగాల వరకు ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చదవండి: ఇండిగో కీలక నిర్ణయం

2026 మే నెలలో ఆయన మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కల్తీ ఆహరంపై ఆయన తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement