రియాద్: సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీకి విమాన సర్వీసుల రద్దును మరికొంత కాలం పొడిగినస్తున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ రోజు (శుక్రవారం) ఈ ప్రకటన విడుదల చేసింది.
సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించింది.
రియాద్: అక్టోబర్ 31, 2026 వరకు (ఆ రోజు సహా) రాకపోకల విమానాలు రద్దు.
జెడ్డా: అక్టోబర్ 27, 2026 వరకు (ఆ రోజు సహా) విమాన సర్వీసులు రద్దు.
దమ్మామ్: అక్టోబర్ 27, 2026 వరకు (ఆ రోజు సహా) విమాన సర్వీసులు రద్దు.
మదీనా: అక్టోబర్ 27, 2026 వరకు (ఆ రోజు సహా) విమాన సర్వీసులు రద్దు.
ఇతర భారతీయ విమానయాన సంస్థల సర్వీసులు కూడా రద్దు
దానితో పాటు సౌదీ అరేబియాకు విమాన సర్వీసులను నిలిపివేసిన సంస్థల్లో ఇండిగోతో పాటు ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను అక్టోబర్ 24 వరకు నిలిపివేశాయి.
ఆకాశ ఎయిర్: అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను అక్టోబర్ 27 వరకు నిలిపివేసింది.ప్రాంతీయ భద్రతా పరిస్థితులను బట్టి విమానాల రద్దు గడువులో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ప్రయాణికులు సంబంధింత విమానాశ్రయాలకు వెళ్లే ముందు తమ విమానాల తాజా పరిస్థితిని సంబంధిత విమానయాన సంస్థల ద్వారా నిర్ధారించుకోవాలని తెలిపింది.
కాగా ఇటీవల సౌదీపై హౌతీల దాడులు తీవ్రతరమయ్యాయి. బుధవారం దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇదే రోజు సౌదీ అరామ్‌కోకు చెందిన షైబా చమురు క్షేత్రంపై జరిగిన మరో దాడిలో కూడా ఒక భారతీయుడు గాయపడ్డాడు.
ఇదీ చదవండి: వచ్చిన 79 ఏళ్లలో ఇదే తొలిసారి


