breaking news
Tukaram IAS
-
నా పిల్లలకు మాత్రం ఐఏఎస్ వద్దు
భారత సమాజంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకున్నా గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది భారతీయ కుటుంబాల్లో ఐఏఎస్ అధికారి కావడం అనేది అత్యున్నత కెరీర్ లక్ష్యంగా భావిస్తారు. తమ పిల్లలు కూడా సివిల్ సర్వీసుల్లో చేరాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఐఏఎస్ అధికారిగా సమాజంలో తన ప్రత్యేకత చాటుకున్న తుకారం ముండే మాత్రం తన పిల్లలను సివిల్ సర్వీస్‌లో చేర్చడం ఇష్టం లేదంటున్నారు. దానికి కారణం తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఐఏఎస్ అధికారి తుకారాం ముండే ఇటీవల గ్లోబల్ మరాఠా బిజినెస్ ఎక్స్‌పోలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాట్లాడుతూ.. "తన పిల్లలు పారిశ్రామికవేత్తలుగా లేదా ప్రజా నాయకులుగా ఎదిగి, మరింత స్వేచ్ఛతో సమాజానికి సేవ చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు". సూమారు 21 ఏళ్ల సర్వీసులో 25 సార్లు బదిలీలను ఎదుర్కొన్న అనుభవమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ బదిలీల ప్రభావం ఆయన ఉద్యోగ జీవితానికే పరిమితం కాకుండా కుటుంబ జీవితంపైనా పడినట్లు ముండే తెలిపారు.పిల్లల చదువుపై బదిలీల ప్రభావంతుకారాం ముండే తన పిల్లలను సివిల్ సర్వీసుల్లోకి రావద్దని సూచించడానికి ప్రధాన కారణం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించడంతో తరచూ నివాసం మారాల్సి రావడమే అన్నట్లు తెలుస్తోంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడం, కొత్త ప్రాంతాలకు అలవాటు పడటం, పిల్లల చదువును కొనసాగించడం వంటి విషయాలు ఆయనను తరచుగా ఇబ్బందులకు గురిచేసింది.ముఖ్యంగా, ఆయన కుమారుడు ఐదో తరగతిలోకి రాకముందే ఆరుసార్లు పాఠశాలలు మారాల్సి వచ్చిందని పలు కథనాలు వెల్లడయ్యాయి. తన పోస్టింగులకు అనుగుణంగా కుటుంబ జీవితాన్ని పదేపదే మార్చుకోవాల్సి రావడంతో, తన భార్య కూడా అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: అవే ఆయన నాతో చివరిగా అన్న మాటలుసాధారణంగా పిల్లల విషయంలో ఇటువంటి మార్పులు తీవ్రంగా ప్రభావం చూపుతాయి. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారినప్పుడు స్నేహితులను, పరిచయమున్న ఉపాధ్యాయులను, అలవాటైన వాతావరణాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. కొత్త పాఠశాలలో మళ్లీ అలవాటు పడటం, కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం, చదువులో కొనసాగింపును కాపాడుకోవడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఐఏఎస్ ఉద్యోగం అధికారంతో, ఉద్యోగ భద్రతతో కూడినదిగా కనిపించినప్పటికీ, ఆ ఉద్యోగాన్ని నిర్వహించే వ్యక్తి కుటుంబం కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ముండే అనుభవం తెలియజేస్తోంది.ఎవరీ తుకారాం ముండే?తుకారాం ముండే మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నిబంధనలను కఠినంగా అమలు చేయడం, వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహించడం, తరచూ బదిలీలను ఎదుర్కోవడం వంటి కారణాలతో ఆయన మహారాష్ట్ర అధికార వర్గాల్లో గుర్తింపు పొందారు. మున్సిపల్ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి విభాగాల వరకు ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: ఇండిగో కీలక నిర్ణయం2026 మే నెలలో ఆయన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కల్తీ ఆహరంపై ఆయన తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. -
తుకారాం మండేను.. వడా పావ్ అడిగిన స్టూడెంట్
ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో వడా పావ్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలంటూ ఓ విద్యార్థి (ఎఫ్‌డీఏ) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సహనంగా సమాధానమిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో సదరు విద్యార్తికి వివరించారు. తుకారాంను విద్యార్థి ప్రశ్నిస్తూ “పాఠశాలల్లో వడా పావ్‌ను నిషేధించారు. కానీ నేను, నా స్నేహితులు దాన్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాం. దీనిపై మీరేమంటారు?” అని అడిగాడు. దీనికి ముండే చిరునవ్వుతో స్పందించారు. “వడా పావ్ తినకపోతే మన జీవితం ఆగిపోదు. దానికి బదులుగా మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే మీరు మరింత ఆరోగ్యంగా, మెరుగ్గా ఎదుగుతారు” అని చెప్పారు.నూనెలో బాగా వేయించిన చిరుతిళ్లకు దూరంగా ఉండాలని విద్యార్థికి ఆయన సూచించారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా ఉండవని వివరించారు. పిల్లలు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు.వడా పావ్‌తో మొదలైన వీరి సంభాషణ చైనీస్ స్ట్రీట్ ఫుడ్ వరకు వెళ్లింది. చైనీస్ ఆహార పదార్థాల గురించి విద్యార్థి అడిగినప్పుడు, వాటిలో కొన్నింటిని తయారు చేసేందుకు కృత్రిమ రంగులు, రసాయనాలు ఉపయోగించే అవకాశం ఉందని ముండే హెచ్చరించారు. రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ, చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఓర్పుతో, అవగాహన కల్పించే విధంగా మాట్లాడిన అధికారిని ప్రశంసిస్తున్నారు.పాఠశాలల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. తుకారాం ముండే జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పాఠశాల క్యాంటీన్లలోనే కాకుండా పాఠశాల ప్రాంగణానికి 50 మీటర్ల పరిధిలో వడా పావ్, సమోసాలు, బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, గ్యాస్ కలిపిన శీతల పానీయాల విక్రయాలు, ప్రకటనలు, పంపిణీపై నిషేధం విధించారు.ఈ ఆదేశాల నేపథ్యంలో పాఠశాల క్యాంటీన్లలో వడా పావ్, సమోసాలు, శీతల పానీయాల స్థానంలో ఇడ్లీ, దోశ, పోహా, ఉప్మా, తాజా పండ్లు, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. పిల్లలకు ఇంటి నుంచి తయారు చేసిన భోజనాన్ని పంపించాలని తల్లిదండ్రులకు సైతం చెబుతున్నారు.ఇదీ చదవండి: పోలీసులపై మద్రాస్ కోర్టు ఆగ్రహం -
ఆదివాసీల ఆశాకిరణం తుకారాం ఐఏఎస్
‘దట్టమైన అడవులు గల ఆదిలాబాద్ జిల్లాలో అత్యం త వెనుకబడిన ఆదిమ జాతికి చెందిన గోండుల్లో మడవి తుకారాంను ఐఏఎస్‌గా చూడటం గర్వంగా ఉంది’ అనేవారు ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామశాస్త్ర వేత్త హైమండార్ఫ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో మడవి బాబూరావ్, మాన్కుబాయి దంపతులకు మూడో సంతానంగా 1941 మే 4న జన్మించాడు తుకారాం. తండ్రి చిరుద్యోగం చేస్తూ, తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవారు. ఆ తపనే తుకారాంను గోండుల్లో తొలి ఐఏఎస్ అధికారిని చేసింది. పేదరికంలో మగ్గుతూనే ఎంఏ వరకు చదువు కున్నారు. మాతృభాష గోండితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించాడు. దేశంలో గిరిజన జాతులు, భాషా సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో రెండోసారి వచ్చిన హైమండార్ఫ్ వద్ద గోండి భాషలో అనువాదకుడిగా పని చేశారు. హైమండార్ఫ్ లండన్ వెళ్లిన తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తుకారాం మొదట కాకినాడ ఆర్డీ వోగా విధుల్లో చేరారు. 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎందరో ఆదివాసులు మృతి చెందినప్పుడు ఉట్నూరు ఐటీడీఏ సహాయ అధి కారిగా ఉన్న తుకారాం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఆదివాసీల సమస్యల పరిష్కారాలకు ఏర్పా టైన రాయ్ సెంటర్లకు తోడ్పడ్డారు. కరీంనగర్లో డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా, హైదరాబాద్‌లో గిరిజన సంస్కృతీ పరిశోధన శిక్షణా సంస్థలో ఇన్చార్జి డెరైక్ట ర్గా, మహబూబ్‌నగర్‌లో డీఆర్డీవోగా సేవలందించిన తుకా రాం అనంతరం ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. తొలుత నిజా మాబాద్ జిల్లా కలెక్టరుగా, తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌గా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంస్థ కమిషనర్‌గా, ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 నవంబర్ 29న ఆయన అస్వస్థతతో తనువు చాలించారు. ప్రతియేటా తుకా రాం వర్ధంతి రోజున గోండు ఆదివాసులు ఆనవాయితీగా నివాళు లర్పిస్తారు. తుకారాం చూపిన బాటలో నడవటమే నేటి ఆదివాసీ యువత ఆయనకు అర్పించే నిజమైన నివాళి. (నేడు తుకారాం గోండ్ 16వ వర్ధంతి) గుమ్మడి లక్ష్మీనారాయణ నర్సంపేట, వరంగల్


