స్కూల్ రీయూనియన్ .. జంట హత్యలకు దారితీసింది | school reunion led to tragic in Tamil Nadu | Sakshi
Sakshi News home page

స్కూల్ రీయూనియన్ .. జంట హత్యలకు దారితీసింది

Nov 22 2026 6:17 PM | Updated on Nov 22 2026 6:17 PM

school reunion led to tragic in Tamil Nadu

సాక్షి,చెన్నై: పాఠశాల పూర్వ విద్యార్థుల కలయిక (స్కూల్ రీయూనియన్) కార్యక్రమం చివరకు జంట హత్యలకు దారితీసింది. స్నేహంగా మొదలైన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరైన మాలిని, నిందితుడు సంజయ్ గాంధీ గతంలో ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. గతేడాది జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజులకే ప్రేమగా మారింది.

అయితే, ఇటీవల కాలంలో మాలిని సంజయ్ గాంధీకి దూరంగా ఉంటూ.. తన సమీప బంధువైన రంజిత్ కుమార్‌తో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ గాంధీ వారిద్దరిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల మాలిని, రంజిత్ కుమార్ కలిసి ఓ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లారు. అప్పటికే పక్కా ప్రణాళికతో మాటువేసిన నిందితుడు వారిపై ఆకస్మికంగా దాడి చేసి దారుణంగా హతమార్చాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సంజయ్ గాంధీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ జంట హత్యలకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement