పాములు పట్టేవాడు.. పాముకాటుకు బలైపోయాడు! | Snake catcher dies after bitten by snake brought home | Sakshi
Sakshi News home page

పాములు పట్టేవాడు.. పాముకాటుకు బలైపోయాడు!

Oct 8 2026 3:59 PM | Updated on Oct 8 2026 4:08 PM

Snake catcher dies after bitten by snake brought home

పాములను పట్టే (Snake catcher) యువకుడు ఆ పాముకాటుకు గురై మరణించడం విషాదాన్ని నింపింది. కేరళలోని చిరయిన్‌కీజు (Chirayinkeezhu) ప్రాంతానికి చెందిన సందీప్ అలియాస్ కణ్ణన్ (33)  స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎంతో చాకచక్యంగా పాములను పడుతూ ఉంటాడు.  కానీ అనూహ్యంగా  ఆ పాము కాటుకే బలైపోయాడు. 

చిరయిన్‌కీజులోని అయ్యంకాళి విగ్రహం సమీపంలో అద్దె ఇంట్లో నివసించే సందీప్‌ బుధవారం  రాత్రి ఒక పామును పట్టుకున్నాడు. తనతో పాటు దాన్ని ఇంటికి  తెచ్చాడు.  రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సందీప్‌ను  ఆ పాము కాటేసింది. దీంతో వెంటనే అతణ్ని చిరయిన్‌కీజు తాలూకా ఆసుపత్రిలో చేర్చించారు. అయితే పరిస్థితి విషమించడంతో తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గురువారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. దీంతో సందీప్‌ భార్య రజని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్‌ చైన్‌ కొట్టేసింది : యూట్యూబర్‌ మధుమితపై కేసు
ఇదీ చదవండి: నానా పటేకర్‌ లాస్ట్‌ మెసేజ్‌, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement