దెబ్బకి వెయ్యి మంది కోటీశ్వరులయ్యారు : సీఈఓ మూడు టిప్స్‌ | Over 1000 Employees Become Millionaires After AI Company Cerebras IPO says ceo | Sakshi
Sakshi News home page

దెబ్బకి వెయ్యి మంది కోటీశ్వరులయ్యారు : సీఈఓ మూడు టిప్స్‌

Nov 25 2026 6:11 PM | Updated on Nov 25 2026 6:32 PM

Over 1000 Employees Become Millionaires After AI Company Cerebras IPO says ceo

ఏఐ కంపెనీ సెరెబ్రాస్ (Cerebras)  ఐపీఓ తర్వాత 1,000 మందికి పైగా ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఈఓ ఆండ్రూ ఫెల్డ్‌మాన్ (Andrew Feldman) 'సౌర్సరీ విత్ మోలీ ఓ'షే' పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.   ఐపీఓ రికార్డ్‌ స్థాయిలో సక్సెస్‌ అయిన ఫలితంగా ఉద్యోగులకు షేర్ల ద్వారా ఈ భారీ సంపద సమకూరింది. అయితే స్టాక్ మార్కెట్‌లోని రోజువారీ హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. అంతేకాదు కంపెనీ షేర్ల ద్వారా అకస్మాత్తుగా భారీ సంపదను పొందిన ఉద్యోగులకు ఫెల్డ్‌మాన్ 3 ముఖ్యమైన ఆర్థిక సలహాలు ఇచ్చారు.

బ్లూంబెర్గ్‌ నివేదిక  ప్రకారం దశాబ్దం క్రితం సహ-స్థాపించిన సెమీకండక్టర్ స్టార్టప్ సెరెబ్రాస్ సిస్టమ్స్,  స్టాక్ మార్కెట్ అరంగేట్రం (IPO) తర్వాత భారీ విజయం సాధించింది. సుమారు 21.7 బిలియన్ల  డాలర్ల విలువైన  ఈ సంస్థ మే నెలలో IPO ద్వారా 5.55 బిలియన్ డాలర్లను  సమీకరించింది. ఆండ్రూ ఫెల్డ్‌మన్ కూడా ప్రపంచంలోని ఏఐ బిలియనీర్ల సరసన చేరారు.

ఆండ్రా ఫెల్డ్‌మాన్‌  మూడు సూచనలు 
పెట్టుబడులను విభజించుకోండి (Diversify Investments): కంపెనీపై నమ్మకంతో లేదా ఇంకా లాభాలు వస్తాయనే ఆశతో మొత్తం సంపదను ఒకే కంపెనీ షేర్లలో ఉంచుకోవడం సరికాదు. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ల తరహాలోనే, కొంత వాటాను విక్రయించి ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకోవాలి.

ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడవద్దు :  చేతికి భారీగా డబ్బు రాగానే సలహాలు ఇచ్చేవారు ఎక్కువవుతారు. వెంటనే ఏదో ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేయకుండా, కొంతకాలం పాటు మనీ మార్కెట్ అకౌంట్ల వంటి తక్కువ రిస్క్ ఉన్న మార్గాల్లో ఆ డబ్బును ఉంచి, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే నిర్ణయాలు తీసుకోవాలి.

జీవిత ప్రాధాన్యతలను సమీక్షించుకోండి: అకస్మాత్తుగా వచ్చిన సంపద జీవితంలో మీకు ఏది ముఖ్యమో ఆలోచించుకునే అవకాశాన్ని ఇస్తుంది. తాను మొదటిసారి భారీగా సంపాదించినప్పుడు ముందుగా తన ఇంటి అప్పు తీర్చేశానని ఫెల్డ్‌మాన్ గుర్తుచేసుకున్నారు. డబ్బు అనేది ఒత్తిడిని పెంచేదిగా కాకుండా, జీవితాన్ని మరింత మెరుగుపరిచేదిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

స్టాన్‌ఫోర్డ్ క్యాంపస్ నుండి సిలికాన్ వ్యాలీ వరకు
56 ఏళ్ల ఫెల్డ్‌మాన్ విజయ ప్రస్థానం మొదటినుంచీ సక్సెస్‌బాటలోనే నడించింది. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో పెరిగారు.  అతని తల్లిదండ్రులిద్దరూ అక్కడ ప్రొఫెసర్లుగా పనిచేశారు. మొదట్లో విద్యా వృత్తిని చేపట్టాలని భావించి నప్పటికీ, బిజినెస్ స్కూల్ పూర్తి చేశాక చివరికి వ్యాపారం వైపు మళ్లారు.

ఒక హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ స్టార్టప్‌లో ఇంజనీరింగ్ విభాగేతర ఉద్యోగిగా చేరడం ఫెల్డ్‌మాన్‌ జీవితంలో పెద్ద మలుపు. ఆయన  ఇంకా ఇరవైలలోనే ఉన్నప్పుడు, సుమారు 18 నెలల తర్వాత ఈ కంపెనీ 280 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. ఆ తర్వాత రివర్‌స్టోన్ నెట్‌వర్క్స్‌ను ప్రారంభించడంలో సహాయపడ్డారు.  2000వ సంవత్సరంలో ఇంటర్నెట్-యుగ నెట్‌వర్కింగ్ వ్యాప్తి , చాట్‌జీపీటీ విజృంభణ సెరెబ్రాస్ తలరాతనుమార్చివేసింది. 2022 చివరలో OpenAI  చాట్‌జీపీటీ ప్రారంభమైనప్పటి నుండి  ఏఐ కంప్యూటింగ్ శక్తికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ఈ కంపెనీ  ఒక రేంజ్‌లో లాభపడింది. ఈ చాట్‌జీపీటీ ప్రపంచవ్యాప్తంగా AI హార్డ్‌వేర్ ఆర్థిక వ్యవస్థను మార్చివేసింది.

సెరెబ్రాస్ ఫ్లాగ్‌షిప్ చిప్‌లు దాదాపు ఒక ప్రింటర్ పేపర్ షీట్ పరిమాణంలో ఉంటాయి, తద్వారా అవి ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద AI-కేంద్రీకృత ప్రాసెసర్‌లలో ఒకటిగా నిలిచాయి. అలాగే  2028 వరకు వందల మెగావాట్ల కంప్యూటింగ్ సామర్థ్యానికి సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని OpenAIతో కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లని అంచనా. అప్పటి నుండి, సెరెబ్రాస్ సాంప్రదాయ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్లను స్వీకరించడానికి బదులుగా, AI శిక్షణ,ఇన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిస్టమ్‌లపై దృష్టి సారిస్తూ, వేగంగా విస్తరిస్తున్న AI హార్డ్‌వేర్ మార్కెట్‌లో ఎన్విడియాకు పోటీదారుగా నిలిచింది. అంతేకాదు ఫెల్డ్‌మాన్  తన ఉద్యోగుల కోసం పెద్ద బార్బెక్యూ విందులు ఏర్పాటు చేస్తాడని కూడా బాగా ప్రతీతి.

ఇదీ చదవండి: రసాభాసగా పోలీస్‌ బాస్‌ల నైట్‌ పార్టీ : ఒకరికి గాయాలు

సెరెబ్రాస్‌ను స్థాపించడానికి ముందు, ఫెల్డ్‌మాన్ డేటా సెంటర్ల కోసం శక్తి-సమర్థవంతమైన సర్వర్‌లపై దృష్టి సారించిన సీమైక్రో అనే స్టార్టప్‌కు కో ఫౌండర్‌గా ఉన్నారు.. ఈ వ్యాపారాన్ని 2012లో అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, 330 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఒప్పందంతో కొనుగోలు చేసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, సెరెబ్రాస్ రివర్‌స్టోన్‌లో ఉండగా అకౌంటింగ్ నియంత్రణలను ఉల్లంఘించినందుకు సంబంధించిన ఒక ఫెడరల్ నేరారోపణకు ఫెల్డ్‌మాన్ 2007లో దోషిగా ఒప్పుకున్నాడని, దీనికి సంబంధించి ఆయనకు జరిమానా కూడా పడిందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement