ఐకియా ఇండియా ఆదాయం అప్‌ | Ikea India revenue rises 14 percent in FY26 | Sakshi
Sakshi News home page

ఐకియా ఇండియా ఆదాయం అప్‌

Nov 25 2026 1:37 PM | Updated on Nov 25 2026 1:37 PM

Ikea India revenue rises 14 percent in FY26

న్యూఢిల్లీ: ఫర్నీచర్, హోమ్‌ ఫర్నీషింగ్‌ స్వీడిష్‌ దిగ్గజం ఐకియా దేశీ విభాగం గత ఆర్థిక సంవత్సరం(2025–26) రూ. 2,100 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 14 శాతం వృద్ధి కాగా.. 2028–29కల్లా లాభాలు ఆర్జించే బాటలో సాగుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మురళీ అయ్యర్‌ పేర్కొన్నారు. కంపెనీ సెప్టెంబ‌ర్‌– ఆగస్ట్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. లాభదాయక వృద్ధిని ప్రతిబింబిస్తూ ఇబిటా 10 శాతం మెరుగుపడినట్లు వెల్లడించారు. అయితే లాభం లేదా నష్టాల వివరాలు వెల్లడించలేదు.

విస్తరణపై పెట్టుబడులు, ఫైనాన్సింగ్‌ వ్యయాలు, తరుగుదల తదితరాల కారణంగా ఆర్థిక ఫలితాలను పోల్చి చూడతగదని తెలియజేశారు. 2024–25లో ఐకియా ఇండియా భారీ విస్తరణను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో లాభదాయకతను సాధించే లక్ష్యాన్ని ఏడాదికి ముందుకు జరిపినట్లు తెలియజేశారు. వెరసి 2030కు బదులుగా 2029కల్లా లాభాల బాటపట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఆదాయం 2030కల్లా మూడు లేదా నాలుగు రెట్లు జంప్‌చేయనున్నట్లు అంచనా వేశారు. ఇందుకు చిన్నతరహా స్టోర్లుసహా ఈకామర్స్, స్థానిక సోర్సింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. 

ఇదీ చ‌ద‌వండి: బంగారం కొనుగోలుదారులకు పండగ దినం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement