సీడీఎస్‌ఎల్‌ డివిడెండ్‌ రూ. 12.75 | CDSL Q4 Net Profit Falls to Rs 80 Crore Despite Revenue Growth | Sakshi
Sakshi News home page

సీడీఎస్‌ఎల్‌ డివిడెండ్‌ రూ. 12.75

May 3 2026 6:44 PM | Updated on May 3 2026 6:44 PM

CDSL Q4 Net Profit Falls to Rs 80 Crore Despite Revenue Growth

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 80 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 100 కోట్లు. ఇక ఆదాయం రూ. 256 కోట్ల నుంచి రూ. 268 కోట్లకు చేరింది. 

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 12.75 మేర తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ. 526 కోట్ల నుంచి రూ. 455 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 1,199 కోట్ల నుంచి రూ. 1,239 కోట్లకు చేరింది. 18 కోట్ల పైగా డీమ్యాట్‌ ఖాతాలు గల తొలి డిపాజిటరీగా ఆవిర్భవించినట్లు సంస్థ ఎండీ నేహల్‌ వోరా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement