breaking news
OCI card
-
ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు!
నేను భారత సంతతి అమెరికా పౌరుడిని. నాకు ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు ఉంది. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాము. అయితే, ఈ అమ్మకాన్ని పూర్తి చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని రిజిస్ట్రార్ కార్యాలయంలో మేము సంప్రదించిన ఒక ఏజెంట్ చె΄్పాడు. రిజిస్ట్రార్ కూడా అది తప్పనిసరి అని చె΄్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రార్ లేదా ఇతర అధికారులకు సమర్పించేందుకు వర్తించే చట్టపరమైన నిబంధనలను స్పష్టంగా తెలియజేయగలరని కోరుతున్నాను. – సుహాస్, అమెరికా (చిత్తూరు)భారత పౌరులు కానప్పుడు ఆధార్ కార్డు మీకెలా వస్తుంది? ఆధార్ చట్టంలోని ’resident’ నిర్వచనం ప్రకారం, గత 12 నెలల్లో కనీసం 182 రోజులు భారతదేశంలో నివసించిన వ్యక్తి నివాసకులు/ ’resident’గా పరిగణించబడతారు. కేవలం OCI కార్డు గ్రహీతగా ఉండటం వల్ల ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి కాదు, మీ కేసులో వీలు కూడా లేదు.ఫెమా నిబంధనల ప్రకారం OCI కార్డు గ్రహీత భారతదేశంలో (ప్రత్యేక పరిస్థితులలో తప్ప) వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫాం హౌస్ మినహా ఇతర స్థిరాస్తుల కొనుగోలు; విక్రయాలు చేయవచ్చు. ఈ లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి పత్రంగా RBI/FEMA నిబంధనలు ఎక్కడా నిర్దేశించలేదు.భారతదేశంలో ఆస్తిని విక్రయించడానికి ఎన్నారైలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఎన్నారైకి ఏదైనా భారతీయ బ్యాంకులో NRO ఖాతా ఉండటం ముఖ్యం.అధికారికంగా అవసరమైన–సూచించిన పత్రాలతోపాటు (1) ఆస్తి పత్రాలు – ఆస్తిపై అప్పులు లేవు అని ధ్రువీకరించే Encumbrance Certificarte (EC); (2) గుర్తింపు ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు – పాన్ కార్డు వంటివి ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ, రిజిస్ట్రార్ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అని పట్టుబడితే, ఆధార్ కార్డు సమర్పించనందుకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని తిరస్కరిస్తూ, అందుకు గల కారణాలను – ఏ చట్టం, నిబంధన, జీఓ Government Order) లేదా ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆధార్ కోరుతున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరండి. రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం, ఆ ఉత్తర్వులపై జిల్లా రిజిస్ట్రార్ లేదా Inspector General of Registration (IG Registration) ముందు అప్పీల్/పిర్యాదు చేసుకొని, ఆధార్ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా సంబంధిత సబ్–రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరవచ్చు. హై కోర్టుకి కూడా వెళ్ళవచ్చు.- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.conకు మెయిల్ చేయవచ్చు. ఇవీ చదవండి: హిమధీర -
ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: విదేశాల్లోని భారత సంతతికి చెందిన వ్యక్తులు తమ గుర్తింపును ప్రవాస భారతీయ పౌరుడిగా మార్చుకునేందుకు గడువును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. భారతీయ ప్రవాసులు ఓసీఐ కార్డు కోసం 31 డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది. 2017 డిసెంబరు 31 వ తేదీ వరకు పిఐఓ కార్డుదారుల ద్వారా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పత్రం సమర్పించాల్సిన తేదీని విస్తరించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఐ) కార్డులను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ (ప్రవాస భారతీయ పౌరులు) కార్డులను డిసెంబరు 31 వరకు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2015 నుంచి పీఐఓ కార్డులను రద్దు చేస్తూ ఆ కార్డులను కలిగి ఉన్నవాళ్లు వాటిని ఓసీఐ కార్డులుగా మార్చుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పిడికి విధించిన గడువును జూన్ 30 వరకు పెంచుతూ మార్చి 31న ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ గడువును కూడా డిశంబర్ 31 వరకు పొడిగించింది. కాగా జూన్ 30 లోపు గుర్తింపు కార్డుల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుందని భావించడం లేదని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఈ గడువును డిశంబర్ 31 వరకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ గడువులోపు తమ కార్డులను మార్చుకున్న వాళ్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి విదితమే. మరోవైపు ఈ మార్పును ప్రకటించినప్పటినుంచి గడువు పొడిగించడం ఇది నాలుగవ సారి.


