కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’

KTR Son Himanshu Rao gets Diana award - Sakshi

గ్రామాల్లో స్వయం సమృద్ధిపై చేపట్టిన ప్రాజెక్టుకు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కింది. బ్రిటన్‌ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్‌ వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్‌ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు.

ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అత్యున్నత అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top