జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణరెడ్డి స్మారక అవార్డు | Ravi Narayana Reddy Memorial Award to Justice Sudarshan Reddy | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి రావి నారాయణరెడ్డి స్మారక అవార్డు

Feb 1 2026 6:15 AM | Updated on Feb 1 2026 6:15 AM

Ravi Narayana Reddy Memorial Award to Justice Sudarshan Reddy

 2వ తేదీన సీఎం చేతుల మీదుగా ప్రదానం 

తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి 2025 సంవత్సరానికి గాను రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును ప్రదా నం చేయాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ నిర్ణయించింది. ట్రస్ట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అవార్డును అందజేస్తారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ‘భారత రాజ్యాంగం–భావప్రకటన స్వేచ్ఛ’అనే అంశంపై జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడతారని వివరించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి, భుక్తి కోసమే కాకుండా నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన మహోత్తర ఉద్యమమని అన్నారు. ఈ పోరాటం ఫలితంగానే హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు. ఆ పోరాట యోధుల త్యాగాలను భావితరాలకు అందించడమే ల క్ష్యంగా రావి నారాయణరెడ్డి తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌కు అంకురా ర్పణ చేశారన్నారు. 1999 నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యో ధులను స్మరించుకుంటూ, స్మారకోపన్యాసాలు నిర్వహించడంతో పాటు రావి నారాయణరెడ్డి పేరుతో జాతీయ అవార్డు ఇవ్వాలని ట్రస్ట్‌ నిర్ణయించిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement