కేటీఆర్‌ స్ఫూర్తితో..

Nithin Plants Tree For Gift A Smile Wish to KTR Birthday - Sakshi

కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ఛాలెంజ్‌ను టాలీవుడ్‌ హీరో నితిన్‌ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు.

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ఛాలెంజ్‌ను టాలీవుడ్‌ హీరో నితిన్‌ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి.. నితిన్‌తో పాటు మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండకు ట్యాగ్‌ చేశారు. దీన్ని స్వీకరించిన నితిన్‌ తన పెరట్లో మొక్కలు నాటారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం మంచి ప్రయత్నమని, ఇలాంటి సామాజిక బాధ్యతతో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రపంచాన్ని అందంగా మార్చడంలో తన బాధ్యతను గుర్తు చేసే ఏ సవాలైనా స్వీకరించడానికి తాను సిద్ధమని.. తన పని పూర్తి చేశానన్నారు. ఇప్పుడు మీ ఫాలోవర్స్‌ సమయం ఆసన్నమైందని, ‘హ్యాపీబర్త్‌ డే కేటీఆర్‌’ అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశారు.  


నాన్నకు ప్రేమతో..
కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన తనయుడు హిమాన్స్ యాదగిరినగర్‌లోని శ్రీకుమార్‌ హైస్కూల్‌లో కేక్‌ కట్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top