హిమాన్షు గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో కేసీఆర్‌ తాత | KCR At Himanshu Graduation Day Celebrations | Sakshi
Sakshi News home page

హిమాన్షు గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో కేసీఆర్‌ తాత

Apr 18 2023 9:25 PM | Updated on Apr 18 2023 9:34 PM

KCR At Himanshu Graduation Day Celebrations - Sakshi

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు..

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు.. తాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షురావు 12వ తరగతి పూర్తి చేసి పట్టా అందుకున్నాడు.

కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు అందించారు. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న మనవడు వెంటనే స్టేజీ దిగివచ్చి తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పట్టా పెట్టి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement