ప్రజల గొంతు నొక్కడం పబ్లిక్‌ హియరింగా? | KTR fires on Revanth Reddy government | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతు నొక్కడం పబ్లిక్‌ హియరింగా?

Oct 30 2026 5:24 AM | Updated on Oct 30 2026 5:24 AM

KTR fires on Revanth Reddy government

మూసీ సుందరీకరణ ముసుగులో రూ.లక్షన్నర కోట్ల లూటీకి కుట్ర: కేటీఆర్‌

సాగు, తాగునీటికి దిక్కులేదు.. మూసీకి 10 టీఎంసీలు తెస్తారా?

డీపీఆర్‌ లేని సుందరీకరణ ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాం

గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. గోబెల్స్‌ సమ్మిట్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు లేదంటూనే మూసీ సుందరీకరణ పేరిట రేవంత్‌ ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని లూటీ చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల గొంతు నొక్కుతూ సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) లేకుండా ‘పబ్లిక్‌ హియ రింగ్‌’ తంతును ముగించే ప్రయత్నాలు జరుగు తున్నాయని మండిపడ్డారు. ఓ వైపు కరువుతో అల్లాడు­తుంటే రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ వైపు పశుగ్రా సానికి కూడా కొరత ఉంటే మరోవైపు మల్లన్న సాగర్‌ నుంచి 10 టీఎంసీల నీటిని తెచ్చి మూసీలో పోసి రేవంత్‌ సుంద రీకరణ పేరిట హడావుడి చేస్తున్నాడని మండిపడ్డారు.

క్రాప్‌ హాలిడే ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేటీ ఆర్‌ మాట్లాడారు. ‘కృష్ణా గోదావరి నదుల్లో వేయి టీఎంసీలను నిర్లక్ష్యంతో దిగువకు వదిలేసిన రేవంత్‌ ప్రభుత్వం 365 కరువు మండలాలను ప్రకటించింది. పొరుగున ఉన్న తమిళనాడులో 35 శాతం, కర్ణాటకలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైనా కరువు లేదు.

ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామంటూ రేవంత్‌ ప్రభుత్వం రైతులను కూలీలుగా మారుస్తోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది మొదలు కుని బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ గళమెత్తుతూ వస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబిత, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నేతలు కార్తీక్‌రెడ్డిని పబ్లిక్‌ హియరింగ్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం.రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాహుల్‌గాంధీ తెలుసు కోవాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

దోపిడీని అడ్డుకోవడంలో తగ్గేది లేదు
‘రేవంత్‌ అహంకారపూరిత మనస్తత్వం వల్లే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడింది. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు ఉండదని తేలి పోయింది. సాయంత్రం 6 గంటల తర్వాత విద్యుత్‌ ఇవ్వలే మంటూ ఐటీ కంపెనీలకు ఫోన్లు చేస్తున్నారు. ఎన్ని కలకు ముందు డిక్లరేషన్లు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు పంటలు వేయొద్దని రైతుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్లు తీసుకుంటోంది. తాగునీరు లేక హైదరాబాద్‌ నుంచి వలసలు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అధికారం చేపట్టి మూడేళ్లుగా కాంగ్రెస్‌ చేస్తున్న దోపిడీని అడ్డుకోవడంలో వెనక్కి తగ్గేది లేదు’ అని కేటీఆర్‌ చెప్పారు. ‘ప్రభుత్వం గ్లోబల్‌ సమ్మిట్‌ పేరిట హడావుడి చేస్తోంది.

అది గోబెల్స్‌ సమ్మిట్‌. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని కేటీఆర్‌ అన్నారు. ‘నిజం నిలకడ మీద తెలు స్తుంది. నా మీద తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు క్షమాపణ చెప్పింది. మొన్న ఒక పత్రిక క్షమాపణ చెప్పింది. ఈ రోజు ఓ మాజీ మంత్రి చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్, ఫార్ములా– ఈ రేస్‌ తదితరాలపై మాపై తప్పుడు ఆరోపణలు చేసినవారంతా భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్పా ల్సిందే’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement